HHVM: రిలీజ్ కాకముందే..పవన్ సినిమా రికార్డు 6 d ago

పవన్ కల్యాణ్ నటించిన 'హరిహర వీరమల్లు' మే 9న థియేటర్లలోకి రావాల్సి ఉంది. నిధి అగర్వాల్ హీరోయిన్‌గా, బాబీ డియోల్ విలన్‌గా నటిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే 11సార్లు వాయిదా పడి రికార్డు సృష్టించింది. ప్రస్తుతం మళ్లీ వాయిదా పడే అవకాశాలున్నాయని సమాచారం. మే 30 లేదా జూన్‌లో విడుదల చేసే యోచనలో మేకర్స్ ఉన్నారని టాక్. కానీ, అధికారిక ప్రకటన వచ్చే వరకు రిలీజ్ డేట్‌పై సందిగ్ధత కొనసాగుతూనే ఉంటుంది.